బాలీవుడ్ యువ నటుడు, ఎంఎస్ ధోని ఫేమ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబయి లోని తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
గత కొన్ని రోజులుగా అనారోగ్యం, ఒత్తిడి తో బాధపడుతున్న సుశాంత్ సింగ్… మందులు వాడుతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎంఎస్ ధోని సినిమా ద్వారా పాపులర్ అయ్యాడు. ఆత్మహత్య కు స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. నాలుగు రోజుల కింద సుశాంత్ మేనేజర్ దిశా సాలిన్ సైతం ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ లో కలకలం రేపుతోంది.
సుశాంత్ సింగ్ ఆఖరి సినిమా చిచోరే ఇటీవలే విడుదలైంది. ఆత్మహత్యలు పరిష్కారం కాదని ధైర్యం గా పోరాడాలని హీరోగా ఆయన సందేశం ఇస్తూ తీసిన సినిమా ఇది. ఐఐటీ ర్యాంకు రాదని తన కుమారుడు ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. కుంగుబాటు పరిష్కారం కాదని తాను కూడా వైఫల్యాలను అధిగమించి నిలదొక్కుకున్నాను అని ఒక తండ్రిగా సినిమాలో తన కుమారుని మోటివేట్ చేస్తాడు. కానీ నిజం జీవితంలో ఈ ధోని ఒత్తిడిని సరిగ్గా ఆడలేకపోయాడు.
0 Comments