(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) ఉషోదయ సాహిత్య వేదిక వారి "సిరిమంజరి కవిరత్న" బిరుదుకు కవయిత్రి దుడుగు నాగలత ఎంపికైనట్లు డా.ధనరాశి ఉషారాణి తెలిపారు. ఉషోదయ సాహిత్య వేదికలో ఆధునిక సిరిమంజరి తెలుగు నూతన ప్రక్రియలో శతకం రచించినందుకు గాను కవిరత్న బిరుదును ప్రకటించారు. నాగలత సిరిమంజరి కవిరత్న అవార్డుకు ఎంపిక కావడం పట్ల కవులు ఉండ్రాళ్ళ రాజేశం, రమేష్, వరుకోలు లక్ష్మయ్య, కోణం పర్శరాములు, బస్వ రాజ్ కుమార్, శాడ వీరారెడ్డి, గొర్రె రాజేందర్, ఆదిమూలం చిరంజీవి, తిరుపతి, రావిరాల బసవయ్య, అన్నాడి జ్యోతిరెడ్డి, పిడపర్తి అనిత తదితరులు అభినందనలు తెలిపారు.


0 Comments