అలాగే అమ్మఒడి పథకానికి సంబంధించి కుటుంబ ఆదాయం పట్టణాల్లో నెలకు రూ.12వేలు, గ్రామాల్లో రూ.10వేల లోపు ఉండాలి. విద్యుత్తు వినియోగం నెలకు 300లోపు యూనిట్లు ఉండాలనే నిబంధన ఉంది. ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటో మినహా ఇతర నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారు ఈ పథకానికి అనర్హులు.
మున్సిపాలిటీ వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థిరాస్తి ఉన్నా పథకానికి అనర్హులు. విద్యార్థులకు 75శాతం హాజరు ఉండాలనే నిబంధన ఉంది. ఈ పథకం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్థులు ఈ పథకానికి అర్హులు కాదు.
ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్ కార్డు, లబ్ధిదారుడు తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. స్కూల్ ఐడీ కార్డు.. ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది. అమ్మఒడి పథకం కింద అర్హత కలిగిన విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లోనే చెక్ చేసుకోవచ్చు.
అర్హుల జాబితాను బట్టి ఎవరెవరికి డబ్బులు వస్తాయో ముందే చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. జగనన్న అమ్మఒడి వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూసుకోవచ్చు. పేదింటి పిల్లల చదువుకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం.
దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబానికి చెందిన విద్యార్థులు తల్లులు ఈ పథకానికి అర్హులు. గ్రామాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలుకు మించకూడదన్నారు. ఆదాయపన్ను చెల్లించేవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు అమ్మఒడికి అర్హులు కాదు. వ్యవసాయ భూమిలో మెట్ట అయితే 10 ఎకరాల్లోపు, మాగాణి భూమి 3 ఎకరాల్లోపు, రెండూ కలిపి ఉంటే 10 ఎకరాల్లోపు ఉండాలి.
విద్యుత్ గరిష్ట వినియోగం నెలకు 300 యూనిట్లు మించకూడదు. డ్రైవర్లు సొంతంగా నడుపుకునే ట్యాక్సీలతో పాటు ట్రాక్టర్లు, ఆటోలకు కూడా మినహాయింపు ఉంది. పట్టణాల్లో స్థిరాస్తికి సంబంధించి ఇంటి విస్తీర్ణం 1,000 చదరపు అడుగులు మించకుండా ఉంటే అమ్మఒడికి అర్హులు.
0 Comments