కరోనా విజృంభిస్తున్న వేళ వందలాది కుటుంబాలు తమ పెద్దదిక్కును కోల్పోతున్నాయి. దీంతో జీవనం కోసం రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొంటోంది.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ మృతుల కుటుంబాలకు ఊరటనిచ్చేలా శుభవార్త చెప్పారు.కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లల పేరిట రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలని నిర్ణయించారు.దానిపై నెలనెల వచ్చే వడ్డీ ఆ పిల్లల కనీస అవసరాలు తీర్చేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.అలాగే ఆ పిల్లలకు 25 ఏళ్లు నిండిన తర్వాత ఈ డిపాజిట్ మొత్తం విత్ డ్రా చేసే అవకాశం కల్పించనున్నారు.
0 Comments