రైతులకు అదిరిపోయే శుభవార్త.. నేడు రైతుల ఖాతాల్లోకి 200 కోట్లు జమ..!

రైతులకు అదిరిపోయే శుభవార్త.. నేడు రైతుల ఖాతాల్లోకి 200 కోట్లు జమ..!


ఆంధ్రప్రదేశ్‌లోని అన్నదాతలకు జగన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రూ.లక్షలోపు పంట రుణాలకు వడ్డీ రాయితీ, అకాల వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని ప్రభుత్వం అందించనుంది. సీఎం జగన్ నేడు రైతుల అకౌంట్లలో నగదు జమ చేయనున్నారు. సాంకేతిక కారణాలతో గతంలో చెల్లింపులు జరగని రైతుల ఖాతాల్లోనూ నగదు జమ చేయనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు దాదాపు రూ. 200 కోట్లకు పైగా నగదును సీఎం జగన్ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 

దీంతో రాష్ట్రవ్యాప్తంగా 45,998 మంది రైతలకు లబ్ధి చేకూరనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల అకాల వర్షాల కారణంగా వచ్చిన వరదలతో దాదాపు 60,832 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది.
వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద 2020-21 రబీ, 2021 ఖరీఫ్‌ సీజన్లలో రూ.లక్షలోపు రుణాలు తీసుకుని, వడ్డీతోసహా చెల్లించిన 8,22,411 మంది రైతులకు వడ్డీ రీఎంబర్స్‌మెంట్‌ కింద రూ.160.55 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వీటితో పాటు ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు, వరదలకు నష్టపోయిన 45,998 మంది రైతులకు రూ.39.39 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీని సీఎం జగన్ విడుదల చేయనున్నారు.

Post a Comment

0 Comments