నిరుద్యోగులకు సీఎం జగన్ దీపావళి కానుక : సీఎం జగన్

నిరుద్యోగులకు సీఎం జగన్ దీపావళి కానుక : సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. నిరుద్యోగులకు సీఎం జగన్ దీపావళి కానుక ప్రకటించారు. భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదముద్ర వేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 6,511 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.

ఏపీఎస్పీలో 2,520 కానిస్టేబుల్‌, 3,580 సివిల్‌ కానిస్టేబుల్‌, 315 సివిల్‌ ఎస్‌ఐ, 96 రిజర్వ్ ఎస్‌ఐ పోస్టుల భర్తీకి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
రిజర్వ్‌ విభాగంలో ఎస్సై పోస్టులు: 96
సివిల్‌ విభాగంలో ఎస్సై పోస్టులు: 315
ఏపీ స్పెషల్‌ పోలీస్‌ విభాగంలో కానిస్టేబుల్‌ పోస్టులు: 2,520
సివిల్‌ విభాగంలో కానిస్టేబుల్‌ పోస్టులు: 3,580
మొత్తం పోస్టులు: 6,511

Post a Comment

0 Comments