వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు వచ్చాయా..? లేదా..? ఇలా చెక్ చేసుకోండి..

వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు వచ్చాయా..? లేదా..? ఇలా చెక్ చేసుకోండి..


 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడో ఏడాది తొలి విడత రైతు భరోసా నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 52.38 లక్షల మంది రైతులకు రూ.3,882.23 కోట్లు రైతు భరోసా సాయం విడుదల చేసింది.

ఇప్పటికే కొంతమంది రైతుల ఖాతాల్లో నగదు క్రెడిట్ అయింది. 

కొంతమందికి ఇంకా డబ్బులు పడలేదు. దీంతో నగదు వచ్చాయా లేదా.. అని తెలుసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

ఇందుకోసం మీ ఆధార్ నెంబర్ చాలు.. సులభంగా స్టేటస్ తెలుసుకునే అవకాశముంది.దీని కోసం రైతు భరోసా వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. 

ఆ తర్వాత నో యువర్ పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్ మిట్ చేయాలి. వెంటనే మీ పేమెంట్ స్టేటస్ తెలిసిపోతుంది.


Post a Comment

0 Comments