రైలు కింద పడిన వృద్ధుడు,50 మీటర్లు ఈడ్చుకెళ్లినా తప్పిన ప్రాణాపాయం

 


చెన్నై గిండి రైల్వే స్టేషన్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. విల్లుపురం-చెన్నై బీచ్ రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన 69 ఏళ్ల వృద్ధుడు రైలు, ప్లాట్‌ఫామ్ మధ్యలో పడిపోయాడు.


రైలు కదులుతుండటంతో వృద్ధుడిని దాదాపు 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఘటనను గమనించిన ప్రయాణికులు వెంటనే కేకలు వేశారు.


అప్రమత్తమైన స్టేషన్ గార్డు పరుగెత్తుకెళ్లి వృద్ధుడిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పినట్లు అధికారులు వెల్లడించారు.




#Chennai #Guindy #TrainAccident #RailwayStation

-------------------------------------------



Reactions

Post a Comment

0 Comments