చిన్నపిల్లలు ఎక్కువగా బొమ్మలు లేదంటే ఆట వస్తువులతో కాలక్షేపం చేస్తుంటారు. కాని ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ 10సంవత్సరాల వయసున్న పిల్లవాడు చిరుతపులి పిల్లతో ఆటలాడుకుంటూ కనిపించాడు. మీరట్‌లోని షాజహాన్‌పూర్‌లోని ఓ మామిడితోటలో ఈ దృశ్యం చోటుచేసుకుంది. పసివాడు పులి పిల్లను పిల్లిలా భావించాడో ఏమో దాన్ని తల పట్టుకుని ఆడించేందుకు తెగ ప్రయత్నించాడు. అయితే పులి పిల్ల మెడకు చిన్న తాడు కట్టు ఉండటంతో పులిపిల్ల సైతం పిల్లవాడికి చిక్కకుండా అటు, ఇటు పరుగులుపెట్టింది. ఎవరు తీశారో తెలియదు కానీ..పులిపిల్లతో పిల్లవాడు ఆటలాడుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వాళ్లంతా వీడు పిల్లవాడు కాదు పిడుగు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చిరుతపులి పిల్లతో ఓ బాలుడు ఆడుకోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. వీడియో వైరల్ కావడంతో అసలు మామిడి తోటలోకి చిరుత పులి పిల్ల ఎలా వచ్చింది..ఆ బాలుడు అంత ధైర్యంగా పట్టుకుంటున్నాడంటే పక్కన ఎవరో పెద్దవాళ్లు ఉండే ఉంటారని తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్లు. పిల్లవాడు తలను, తోకను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. చిరుతపులి పిల్ల కూడా అమాయకులతో హాయిగా చూస్తోంది.
0 Comments