జాగ్రత్త గా ఉండండి: కలెక్టర్ హరిత

(చట్టం - వరంగల్ రూరల్\ శివ) : ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల జరిగే ప్రమాదాల పట్ల జిల్లా ప్రజలు జాగ్రత్త గా ఉండాలని జిల్లా కలెక్టర్ హరిత ఒక ప్రకటన లో తెలిపారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని... పొంగి పొర్లుతున్న వాగుల వద్ద.. మత్తడి పడుతున్న ప్రాంతాల అతి జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఏమైనా ప్రమాదం సంభవించిన లేదా సహాయం కావాలన్న వెంటనే సంబంధిత మండల తహసీల్దార్ లకు తెలియజేయాలని అన్నారు. పెద్ద పెద్ద చెట్ల కింద నిలబడకూడదని శిథిలావస్థకు చేరుకున్న భవనాల నుండి అతి త్వరగా ఖాళీ చేయాలన్నారు. ఇంకో 2 రోజుల వరకు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Reactions

Post a Comment

0 Comments