(చట్టం - సిద్దిపేట) : కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇనెస్పెక్టర్ సుధాకర్ కోవిడ్-19 రోగి ప్లాస్మా దానం చేశారు. నెలక్రితం సుధాకర్ కోవిడ్ భారిన పడి కోలుకున్నాడు. ఓ వ్యక్తికి 'బీ పాజిటివ్' ప్లాస్మా అవసరం అని స్నేహితుల ద్వారా తెలిసింది. దీంతో ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకుని హైదరాబాద్ నగరంలో కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగికి ప్లాస్మా దానం చేశారు. ఎస్ఐ చర్యను పోలీస్ కమిషనర్ డి జోయిల్ డేవిస్ ప్రసంశించారు. కోవిడ్-19 భారిన పడి కోలుకున్న వారు ఇతరుల ప్రాణాలు రక్షించేందుకు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాల్సిందిగా కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
0 Comments