ఆట బొమ్మల్ని మనమే చేసుకుందాం... మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ పిలుపు

ఆట బొమ్మల్ని మనమే చేసుకుందాం... మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ పిలుపు

గుండు సూది నుంచి సిగరెట్ లైట్ వరకూ... మనం వాడే వస్తువుల్లో 90 శాతం చైనావే ఉంటున్నాయి. వాటిని మన దేశంలోనే ఉత్పత్తి చేసుకోలేమా? చైనా నుంచి ఎందుకు దిగుమతి చేసుకోవాలి? మనకు ఆ మాత్రం స్థాయి లేదా అని మనందరికీ అనిపిస్తూ ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఇదే అంశాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నారు. ఈమధ్యే ఆగస్ట్ 15 నాడు... ఆత్మనిర్భర భారత్ సాకారం కోసం గుచ్చి గుచ్చి చెప్పిన మోదీ... తాజాగా 68వ మన్ కీ బాత్ లోనూ ఇదే విషయాన్ని మళ్లీ చెప్పారు. పిల్లలు ఆడుకునే బొమ్మల్ని మనమే తయారుచెయ్యాలని మోదీ పిలుపిచ్చారు. యువత ముందుకి వచ్చి బొమ్మల తయారీ స్టార్టప్‌లు ప్రారంభించాలని కోరారు. ఏది కావాలన్నా చైనా లాంటి దేశాలపై ఆధారపడకుండా ఇండియాలోనే తయారవ్వాలనే సందేశాన్ని ఇవాళ్టి బాత్‌లో ఇచ్చారు మోదీ.

కరోనా టైంలో రైతులు కష్టపడి పంటలు పండిస్తున్నారని మోదీ మెచ్చుకున్నారు. వేదాల్లో కూడా రైతుల మేలుపై శ్లోకాలు ఉన్నాయన్నారు. పండుగల్ని మిస్ చేయవద్దన్న మోదీ... కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ... వాటిని జరుపుకోవాలన్నారు. ఆరోగ్యంపై ఫోకస్ పెట్టిన మోదీ సెప్టెంబర్ నెలను పోషకాల నెల (nutrition month)గా జరపబోతున్నట్లు తెలిపారు. పిల్లలకు సరైన పోషకాలు అందితే... వారు శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటారన్నారు.

Post a Comment

0 Comments