డ్రాగన్ దేశం చైనాలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రేజ్ మామూలుగా లేదు. చైనా ప్రభుత్వ అధికారిక పత్రికగా పేరుపొందిన గ్లోబల్ టైమ్స్ నిర్వహించిన ఓ సర్వేలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చైనీయుల్లో 50 శాతం మంది అభిమానిస్తున్నారు. తమ సొంత దేశంలోని జీ జిన్ పింగ్ ప్రభుత్వం కంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద చైనీయులు అభిమానం చూపిస్తున్నారు. గ్లోబల్ టైమ్స్ నిర్వహించిన సర్వే ప్రకారం సుమారు 50 శాతం మంది చైనీయులు మోదీని మెచ్చుకుంటున్నారు.
మిగిలిన 50 శాతం మంది జీ జిన్ పింగ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఈ సర్వే ప్రకారం భారత్‌లో చైనా వ్యతిరేక సెంటిమెంట్ బాగా పెరిగిందని 70 శాతం మంది అభిప్రాయపడ్డారు. 30 శాతం మంది మాత్రం చైనా, భారత్ మధ్య సంబంధాలు భవిష్యత్తులో మళ్లీ మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 25 శాతం మంది రెండు దేశాల మధ్య సంబంధాలు సుదీర్ఘకాలం బలంగా ఉంటాయని భావించగా, 9 శాతం మంది మాత్రం అలా జరగకపోవచ్చని అంచనా వేశారు.
0 Comments