టిడ్కో ఇళ్లపైన సీఎం జగన్ సమీక్ష సందర్భంగా.. ఫేజ్-1లో భాగంగా 85,888 ఇళ్ల పనులు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. ఈ కాలనీల్లో మౌలిక వసతుల పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, ఈ ఏడాది డిసెంబర్ కల్లా లబ్ధిదారులకు ఇళ్లు అందిస్తామని చెప్పారు. పట్టణాలు, నగరాల్లోని మధ్య తరగతి ప్రజలకు సరసమైన ధరలకే ప్లాట్లు పథకాన్ని కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. దాదాపు 3.94 లక్షల ప్లాట్లకు డిమాండ్ ఉందని అధికారులు తెలిపారు. 150, 200, 250 గజాల విస్తీర్ణంలో ప్లాట్లు.. వివిధ రకాలుగా భూముల గుర్తింపు, సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. దసరా నాటికి కార్యాచరణ సిద్ధంచేసి అమలు తేదీలు ప్రకటించాలని సీఎం జగన్ ఆదేశించారు.
వైఎస్సార్ జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు, ఎంఐజీ లే అవుట్లు, 90 రోజుల్లో ఇళ్లపట్టాల కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. ఇళ్ల నిర్మాణ సామగ్రికి రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 5,120 కోట్లు ఆదా చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణ సామగ్రికి దాదాపుగా రూ. 32 వేలు ఆదా అయిందని అధికారులు వివరించారు.
0 Comments