నిజామాబాద్ (చట్టం) : తెలంగాణ ఆకుపచ్చ మనిహారం 6 వ విడత హరితహారంలో భాగంగా గౌరవనీయులు మన ఎంపీపీ శ్రీ గద్దె భూమన్న ఆధ్వర్యంలో మన మాధవనగర్ సాయిబాబా మందిరంలో, బైపాస్ రోడ్డులో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి సంరక్షించుకోవాలని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం హరితహారంలో నెంబర్ వన్ స్థానం కావాలని కోరారు.
బాజిరెడ్డి గోవర్థన్ ఆరోగ్యం కుదుటపడాలని…
అంతకుముందు మాధవనగర్ మందిరంలో నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోగ్యం కుదుట పడాలని మాధవ నగర్ సాయి బాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీఓ సురేందర్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ సోమయ్య, ఈఓ రవీందర్, బర్దీపూర్ సర్పంచ్ నీరడీ సుజనా, పద్మారావు, సాయిలు, ఉప సర్పంచ్ గంగారెడ్డి, ఎంపివో రామకృష్ణ, ఏపీవో ఓంకార్, టెక్నికల్ అసిస్టెంట్ సంపూర్ణ, టెక్నికల్ అసిస్టెంట్ రాజేశ్వర్, ఎపిఎం ఉమాకాంత్, ఇతర సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది.
0 Comments