(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) కళామతల్లి ముద్దు బిడ్డ చిందు యక్షగానం కళాకారుడు పిల్లిట్ల దేవదాసు మరణం చిందు యాక్షగాన ప్రేమికులకు కళాకారులకు తీరని లోటు.వేల ప్రదర్శనల్లో పాల్గొని ఎన్నోఅవార్డులను అందుకొని తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఉద్యోగం చేస్తున్న అతని గానానికి శ్రోతలుమైమరచి ముగ్దులయ్యేవారు. ఆతని మరణం ఉమ్మడి మెదక్, సిద్దిపేట జిల్లా కళా జగత్తు దిగ్భ్రాంతికి లోనైంది. అతని ఆత్మకు శాంతి కలగాలని చిత్ర నివాళి తో వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ మానవతా చిత్రకారులు రుస్తుం. ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీరుస్తుం, నేచర్ ఆర్టిస్ట్ రూబినారుస్తుం, తెలంగాణ చిత్రకారుల సంఘము ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
0 Comments