గ్రామ సచివాలయాల్లో మరో కీలక అడుగు.. ఇక పెండింగ్ మాటే ఉండదు...

గ్రామ సచివాలయాల్లో మరో కీలక అడుగు.. ఇక పెండింగ్ మాటే ఉండదు...


                                         

గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో మరో కీలక అడుగు పడింది. నిర్దేశిత సమయంలోగా వినతులు, దరఖాస్తుల అమలుపై పర్యవేక్షణ ఉండనుంది. ఇందుకోసం పర్సుయేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ యూనిట్‌ (PMU)ని ఏర్పాటు చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా PMUని సీఎం జగన్ ప్రారంభించారు. దరఖాస్తు ఎక్కడ ఆగినా సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం పీఎంయూ అప్రమత్తం చేస్తుంది. దాఖలైన దరఖాస్తులు యంత్రాంగంలోని వివిధ దశల్లో వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా వినతుల పరిష్కారంపై పర్యవేక్షిస్తుంది.ప్రభుత్వ యంత్రాంగంలో ఎక్కడ ఆగినా సంబంధిత అధికారులకు, సిబ్బందికి అలర్ట్స్‌ పంపిస్తుంది.

దరఖాస్తు పెండింగులో ఉంటే ఉదయం డిజిటల్‌ మెసేజ్‌ చేస్తారు, మధ్యాహ్నం లోగా కూడా అది పరిష్కారం కాకపోతే నేరుగా సంబంధిత సిబ్బందికి పీఎంయూ కాల్ చేస్తుంది. పీఎంయూలో 200 మంది సిబ్బంది ఉంటారు. మొదటగా 4 సేవలపై ఈ పర్యవేక్షణ వ్యవస్థను తీసుకొచ్చారు. అక్టోబరు నుంచి 543కి పైగా సేవలపై పర్యవేక్షణ ఉంటుంది.

ఈ సందర్భంగా మారుమూల ప్రాంతాల్లోని సచివాలయాలకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఫంక్షనల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులతో ఈ సచివాలయాలకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తున్నారు. ఇంటర్నెట్‌ లేని 512 సచివాలయాలను ఈ విధానం ద్వారా అనుసంధానం చేస్తున్నారు. మొదటగా 213 సచివాలయాలలకు ఫంక్షనల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సర్వీసును ప్రారంభించారు.
మిగిలిన సచివాలయాలకు వచ్చే 2 నెలల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

Post a Comment

0 Comments