రాష్ట్రంలో డిసెంబరు 28 నుంచి రైతు బంధు డబ్బుల పంపిణీ జరుగుతోంది. యాసంగి పంట సాయం కింద.. ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం డబ్బులను జమచేస్తోంది. మరి ఇప్పటి వరకు ఎంత మంది రైతులకు డబ్బలు వచ్చాయి? ఏ జిల్లాకు ఎక్కువ సాయం అందిందో తెలుసా? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణలో జనవరి 7 వరకు రోజు వరకు 58.07 లక్షల మంది రైతుల ఖాతాలలోకి యాసంగి రైతుబంధు నిధులు జమచేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
మొత్తం 132.65 లక్షల ఎకరాలకు గాను రూ.6632.74 కోట్లు జమ చేశారు. పదెకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాలలోకి నేరుగా నిధులను డిపాజిట్ చేశారు.
తెలంగాణలో అత్యధికంగా నల్గొండలో 4,31,660 మంది రైతుల ఖాతాలలోకి రూ.530.07 కోట్లు
జమచేశారు. ఇక కనిష్టంగా మేడ్చల్ జిల్లాలో 29,685 మంది రైతుల ఖాతాలలోకి రూ.26.82 కోట్లు జమ
చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
నల్లగొండ తరువాత స్థానాలలో అత్యధిక లబ్దిదారులు ఉన్న ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు. లక్ష లోపు లబ్దిదారులు ఉన్న జిల్లాలు మేడ్చల్, ములుగు, వరంగల్ అర్బన్ (ప్రతీకాత్మక చిత్రం)
రైతులు తక్కువగా ఉన్నప్పటికీ విస్తీర్ణం ఎక్కువ ఉండడంతో నల్లగొండ తర్వాత ఎక్కువ నిధులు నాగర్ కర్నూలు జిల్లాకే వెళ్లాయి. అక్కడ 2,52,958 మంది రైతుల ఖాతాలలో రూ.327.13 కోట్లు జమ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
అన్నం పెట్టే రైతు ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్ష
అని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అందుకే కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు సాయం
అందిస్తున్నామని చెప్పారు.
0 Comments