అనంతపురం : ఉరవకొండ: కరోనా నియంత్రణపై సమీక్ష కోసం సోమవారం అనంతపురం వచ్చిన డిప్యూటీ సిఎం ఆళ్ల నాని, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణలను మాజీ ఎమ్మెల్యే ,ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్ వై. విశ్వేశ్వరరెడ్డి జెడ్పీ హాల్లో కలిసారు.ఉరవకొండ నియోజకవర్గ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన వారిని కోరారు.
0 Comments