తల్లిపాలు బిడ్డల ఆరోగ్యానికి  ప్రకృతి  ప్రసాధించిన గొప్ప వరం : అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం

తల్లిపాలు బిడ్డల ఆరోగ్యానికి  ప్రకృతి  ప్రసాధించిన గొప్ప వరం : అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం

(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) : తల్లిపాల వారోత్సవాలు 1-7.8.2020 పురస్కరించుకుని రుస్తుం అర్ట్ గ్యాలరీలో సోమవారం అమృతమూర్తి "తల్లిపాలుశ్రేష్ఠం" క్యాన్వాస్ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. సృష్టిలో అమూల్యం అమ్మా, ప్రకృతిలో అమృతమూర్తిని మించిన దైవంలేదు. బిడ్డకు తల్లిపాలు శ్రేష్ట్రాతి శ్రేష్టం తల్లిపాలల్లో బిడ్డ ఆరోగ్యానికీ రక్షణ కవచంగా వుండే నాల్గువందల ఔషధగుణాలు తల్లి పాలల్లో పుష్కలంగా ఉన్నవి. తల్లులు బిడ్డలకు చనుపాలు ఇచ్చి పరిపూర్ణ మాతృత్వం అనుభవించాలని అదే తల్లి బిడ్డలకు ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ ఆరోగ్యం.  బంగారు తెలంగాణలో భాగంగా ముఖ్యమంత్రి కెసీఆర్ తల్లీ బిడ్డలకు ఇచ్చే ప్రోత్సాహకాలు అభినందనీయమని వాటిని అందరు సద్వినియోగం చేసుకోవాలని, మీడియా మిత్రులు తల్లిపాల ప్రాముఖ్యతను విశేషంగా ప్రచురించి అందరికి చైతన్యం కలుగజేయాలని మానవతా చిత్రకారులు రుస్తుం ఆకాక్షించారు. ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం, నేచర్ ఆర్టిస్ట్ రుబీనారుస్తుం, ఆయేషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments