తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్..

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్..


కరోనా బారిన పడ్డ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే
వారం కింద జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కలిసిన బాజిరెడ్డి
ముత్తిరెడ్డికి పాజిటివ్ అని తేలడంతో పరీక్షలు చేయించుకున్న బాజిరెడ్డి

తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. నిన్న ఎమ్మెల్యే దంపతులు కరోనా పరీక్షలు చేయించుకోగా.. ఎమ్మెల్యేకు పాజిటివ్ గా నిర్ధరణ అయ్యింది. దీంతో చికిత్స కోసం హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. వారం కింద జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని హైదరాబాద్ లో బాజిరెడ్డి కలిశారు. ముత్తిరెడ్డికి పాజిటివ్ వచ్చిందన్న విషయం తెలియడంతో నిన్న బాజిరెడ్డి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, అనుచరులు హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. అయితే నిన్న బాజిరెడ్డి డిచిపల్లి మండలం బీబీపూర్ తండాలో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేతోపాటు ఎమ్మెల్సీ వీజీగౌడ్, ఎమ్మెల్యే కుమారుడు, ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, డిచిపల్లి జెడ్పీటీసీ ఇందిర, ఎంపీపీ భూమన్న, ఆర్టీవో వెంకటయ్య, ఇతర మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, స్థానికులు పాల్గొనగా.. అందరూ హోంక్వారంటైన్ కు వెళ్లిపోయారు.

Post a Comment

0 Comments