కరోనా పరీక్షల విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం…

కరోనా పరీక్షల విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం…

ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్ లలో పరీక్షలు, చికిత్సలకు అనుమతి
జనం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో సీఎం కేసీఆర్ పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ ల్యాబ్ లు, ఆస్పత్రుల్లో పరీక్షలతోపాటు చికిత్సకు అనుమతి ఇచ్చారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించి, ధరలను నిర్ణయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీటితోపాటు జీహెచ్ఎంసీ తోపాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 30 నియోజకవర్గాల్లో 50వేల మందికి వారం పది రోజుల్లో కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల్లో పాజిటివ్ గా తేలినా ఎలాంటి లక్షణాలు లేకుంటే ఇంట్లోనే ఉంచి చికిత్స అందేలా చూడాలని చెప్పారు. ఇన్నాళ్లూ ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతి ఇవ్వబోమని చెబుతూ వచ్చిన కేసీఆర్.. కేసుల పెరుగుదలతో ప్రైవేట్ కు అనుమతి ఇచ్చారు.

Post a Comment

0 Comments