దేశంలోక్షలు దాటిన కరోనా కేసులు
జనం న్యూస్, దిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. లాక్ డౌన్ ఎత్తేసినప్పటి నుంచి కేసుల సంఖ్య అమాంతం పెరుగుతూనే ఉంది. రికార్డ్ స్థాయిలో గడచిన 24 గంటల్లోనే 11929 కరోన కేసులు నమోదు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లోనే 311 మంది కరోనా వల్ల మృత్యువాత పడ్డారు.
దేశంలో కరోనా బాధితుల సంఖ్య మొత్తం 3,20,922 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో 1,49,348 మందికి చికిత్స కొనసాగుతుండగా.. 1,62,379 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్కరోజే కోలుకున్న 8050 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కోవిడ్-19 వైరస్ సోకి ఇప్పటివరకు 9195 మంది మృతి చెందినట్లు పేర్కొంది. దేశంలో గడిచిన 20రోజుల్లోనే లక్ష కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
0 Comments