ఓ యువతికి రెండు రోజుల్లో రెండు సార్లు పెళ్లి జరిగింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ఒకటి పెద్దలు కుదిర్చిన వివాహం అయితే.. మరొకటి ప్రేమ వివాహం. ఈ వింత ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లాలో జరిగింది. కనగల్ మండలం శాబ్దులాపురానికి చెందిన మౌనిక కుటుంబం పదేళ్లుగా కురంపల్లిలో జీవిస్తోంది.
మౌనికకు దేవరకొండకు చెందిన యువకుడితో పెద్దలు పెళ్లి కుదిర్చారు. శుక్రవారం వివాహం జరగగా.. వరుసకు మేనమామ అయిన కొండభీమనపల్లికి చెందిన రాజేష్, మౌనికలు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. మౌనిక పెళ్లి అయిన కొద్దిసేపటికి ప్రియుడు రాజేష్ రాగా.. అతన్ని పట్టుకుని ఏడ్చింది పెళ్లి కూతురు. ఇది చూసి షాక్ కు గురైన భర్త పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి పెళ్లి రద్దు చేసుకున్నారు. ప్రేమించుకున్న మౌనిక, రాజేష్ ల కుటుంబ సభ్యులు మరుసటి రోజే ఓ ఆలయంలో బంధువుల సమక్షంలో పెళ్లి జరిగింది. ఇలా రెండు రోజుల వ్యవధిలోనే మౌనిక రెండు పెళ్లిళ్లు చేసుకుంది.
0 Comments