ఈ సీజన్ మొత్తం సాధారణంగా చేసే పారిశుద్ద్యానికి అదనంగా నాలుగు రెట్లు ఎక్కువగా పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.
ప్రతి ఆదివారం పది గంటలకు పదినిమిషాలు పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామని, తద్వారా ప్రతి ఒక ప్రతి ఒక్కరు పారిశుద్ధ్య
కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలు కలుగుతుందని ఆయన తెలిపారు. ప్రతివారం పాటు పది నిమిషాల చొప్పున తమ సొంత కుటుంబాల కోసం సమయం కేటాయించుకుంటే దోమల ద్వారా వచ్చేటువంటి అనేక సీజనల్ వ్యాధులు ఎదుర్కోవచ్చని సూచించారు.
ప్రతి వర్షాకాలం నీళ్లు నిలిచిపోయే ప్రాంతాల్లో ఉన్న వాటర్ లాగిన్ పాయింట్లు, మ్యాన్ హోళ్ళ వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మరోసారి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని పట్టణాలను హరిత పట్టణాలుగా మార్చేందుకు కృషి చేయాలని పురపాలక శాఖ మంత్రి విజ్ఞప్తి చేశారు.
పట్టణాల్లో హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు మున్సిపల్ శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి, నిరంతరం సమీక్ష నిర్వహించాలని పురపాలక శాఖాధికారులను కోరారు. గతానికి భిన్నంగా ప్రతినెల ఫైనాన్స్ కమిషన్ నిధులను ప్రభుత్వం నేరుగా పురపాలికలకు అందిస్తూ వస్తున్నదని, ఇప్పటిదాకా సుమారు వెయ్యి కోట్లకు పైగా నిధులను అందించామని కేటీఆర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వేంకటేశ్వరరావు మరియు కమిషనర్‌ని మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
0 Comments