సామూహిక అత్యాచారనికి గురైన అమ్మాయికి న్యాయం చేయాలి

సామూహిక అత్యాచారనికి గురైన అమ్మాయికి న్యాయం చేయాలి


(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) : గిరిజన అమ్మాయి పై లైంగిక దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, సభ్యసమాజం తల దించుకొనే విధంగా అత్యంత పాశవికంగా  అత్యాచారానికి గురైన మహిళకు న్యాయం చేయాలని, అత్యాచారానికి కారకులైన 139 మంది నిందితులను అరెస్ట్ చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరాయ ఎల్లం, సిద్దిపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి, సిద్దిపేట జిల్లా పోలీస్ కమీషనర్ కి మెమోరాండం అందజేశారు. బాధిత యువతికి న్యాయం జరగని యెడల ఎన్‌టిఎఫ్‌ ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలను కలుపుకుని ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇందులో తెలంగాణ జన సమితి జిల్లా కోఆర్డినేటర్ తొడుపుణురి వెంకటేశం గారు పాల్గోని బాధిత మహిళకు న్యాయం జరగాలన్నారు,
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరాయ ఎల్లం, జిల్లా అధ్యక్షులు కెమ్మసారం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కెమ్మసారం శ్రవణ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి నర్సింలు, రాష్ట్ర నాయకులు బండి రమేష్, కెమ్మసారం రాజు, లోకల్ రాజు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments