ఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆయన తీవ్ర కోమాలో ఉన్నారని ఆర్మీ రిసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ తెలిపింది. వెంటిలెటర్ సాయం పొందుతున్నట్లు... ఇంకా కోమాలోనే ఉన్నట్లు వెల్లడించింది. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ సోకడంతో అందుకు సంబందించిన చికిత్స అందజేస్తున్నట్లు తెలిపింది. మంగళవారం ఆయన రెనల్ పెరామీటర్స్ స్వల్పంగా క్రమం తప్పినట్టుగా వివరించింది. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య విషయంలో జాగ్రతలు తీసుకుంటున్నారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రణబ్ ఆర్మీ హాస్పిటల్‌లో ఈ నెల 10 చేరారు. అక్కడే ఆయనకు బ్రెయిన్ సర్జరీ కూడా జరిగింది. ఆ తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తెలిసింది. అప్పటి నుండే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పాలి.
0 Comments