(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) : ప్రముఖ కవి, రచయిత, బాలసాహితీ వేత్త కలువకొలను సదానంద మృతి సాహితీ లోకానికి తీరని లోటని బాల సాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం అన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన కలువకొలను సదానంద అనేక ప్రక్రియలలో రచనలు చేసి పుస్తకాలు ప్రచురించి ఎన్నో పురస్కారాలు పొందారని అన్నారు. ముఖ్యంగా "అడవితల్లి" నవలకు గాను బాలసాహిత్యంలో తొలి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన సదానంద మరణం పట్ల కవులు బస్వ రాజ్ కుమార్, కోణం పర్శరాములుతో కలిసి శ్రద్ధాంజలి ఘటించారు.
0 Comments