టెక్నాలజీ ఉపయోగించి నేరస్తులకు శిక్ష పడే విధంగా కేసులు పరిశోధన చెయ్యాలి
(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) : జిల్లాల ఎస్పీలతో పోలీస్ కమిషనర్ల తో గ్రేవ్ కేసులు, సెన్సేషనల్ కేసుల గురించి డిజిపి ఆఫీస్ నుండి తెలంగాణ రాష్ట్ర డిజిపి ఎం.మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ డి.జోయల్ డేవిస్ ఐపీఎస్ జిల్లాలో పెండింగ్లో ఉన్న గ్రేవ్ కేసులు, సెన్సేషనల్ కేసుల గురించి ఓఈల గురించి వివరించారు.
పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరం చట్టం గురించి ప్రతిరోజు సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సీఐలకు, ఎస్ఐలకు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న గ్రేవ్ కేసులలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి రాగానే రిపోర్టు కేసులు ఫైనల్ చేసి చార్జిషీటు వేయాలని సూచించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు గురించి ఒక్క యూనిట్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ నియమించి ప్రతిరోజు మానిటర్ చేయాలన్నారు. గ్రేవ్ కేసెస్ లలో నేరస్తులకు శిక్ష పడే విధంగా పరిశోధన, టెక్నాలజీ వినియోగించి ట్రయల్ సమయంలో సాక్షులను మోటివేట్ చేసి శిక్షలు పడేటట్లు చేయాలని సూచించారు. పెండింగ్ ఉన్న ఓఈ లను త్వరగా పూర్తి చేయాలన్నారు. కేసుల్లో శిక్షల శాతం పెంచాలని పెంచాలన్నారు. కేసులలో శిక్షల శాతం 36శాతం ఉన్నందుకు పోలీస్ అధికారులను సిబ్బందిని డిజిపి అభినందించారు. పెండింగులో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూటివ్ చేయాలని సూచించారు. పెండింగ్ ఉన్న దరఖాస్తుల్లో ఎంక్వైరీ పూర్తిచేసి పిటిషన్ మేనేజ్మెంట్ లో దరఖాస్తు ఎంక్వేరి రిపోర్ట్ అప్లోడ్ చేయాలని సూచించారు. పెండింగులో ఉన్న మైనర్ పిఆర్ లను త్వరగా డిస్పోజల్ చేయాలని సూచించారు. ఈ పెట్టి కేసులు నమోదు చేసిన మరుసటి రోజు నిందితుల పై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. నాన్ కాంటాక్ట్, స్పీడ్ లేజర్ గన్ ద్వారా నమోదు చేసిన కేసుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పెండింగ్ ఉన్న డబ్బులు వాహనదారులతో కట్టించాలి అన్నారు. హైవే రోడ్, రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదాలు తగ్గించే విధంగా 24X7 పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. రాత్రి సమయాల్లో రోడ్లపై వాహనాలు పార్క్ చేయకుండా చూడాలన్నారు. కరోనా వ్యాధి నివారణకు, లాక్‌డౌన్ సమయంలో 24X7
విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను సిబ్బందిని అభినందించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, గజ్వేల్ ఏసీపీ నారాయణ, సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ, ఎస్బిఐ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఏఓ శ్రీమతి సవిత, సిసిఆర్బి ఎస్ఐ ముఖేద్ పాషా, ఐటి కోర్ టీం కమ్యూనికేషన్సి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
0 Comments