(చట్టం - కోహెడ / పిట్ల శ్రీనివాస్) : కోహెడ మండలంలోని పెద్ద సముద్రాల, నగసముద్రాల గ్రామాలలో పలు కుటుంబాలను ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జి మాజీ హౌజ్ పేడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పరామర్శించారు. కోహెడ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను కలుపుకొని సముద్రాల గ్రామంలో పిల్లి మల్లయ్య కుటుంబన్నీ పరామర్శించి తరువాత నగసముద్రాల గ్రామంలోని పార్టీ సీనియర్ నాయకులు చింతలపెళ్లి రామిరెడ్డి ఇటీవల అకాల మరణం పొందిన సందర్భంగా వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంద ధర్మయ్య, గాజుల వెంకటేశ్వర్లు, భీమ్ రెడ్డి తిరుపతి రెడ్డి, రాగుల శ్రీనివాస్. సుధ గోని మధు గౌడ్, , ఆవుల మహేందర్, దూలం శ్రీనివాస్, చింతకింది శంకర్, బైరి శ్రీనివాస్ మంద కిష్టయ్య యాదవ్, మంద దయాకర్, సంపత్ రెడ్డి, అట్ల శ్రీనివాస్, ఇట్టబోయిన శ్రీకాంత్ యాదవ్, గాజుల సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.
0 Comments