(చట్టం - హుస్నాబాద్ / పిట్ల శ్రీనివాస్) : ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ తీసుకువచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్య పరిష్కరించాలని ఏఐఎస్‌ఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సమస్యలుపై, అంబులెన్స్ రావాలని డిమాండ్ చేస్తూ గత 11 రోజులుగా నల్లబ్యాడ్జితో నిరసన తెలుపుతున్న హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కు శ్రీనివాస్ కి అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్) నుండి సంపూర్ణ మద్దతు కోసం నల్ల బ్యాడ్జి సారించి మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంపై స్పందించే వరకు ఏఐఎస్‌ఎఫ్ గా మా వంతు కూడా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 30 న అంబులెన్స్ కోసం వారు తలపెట్టిన భిక్షాటన కార్యక్రమంలో విద్యార్థి,యువజన, ప్రజాసంఘాలు, పార్టీలు, నియోజకవర్గ ప్రజలు పాల్గొని అంబులెన్స్ సమస్య పరిష్కారం మరియు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు.
0 Comments