కరోనా కష్టకాలంలో కొన్ని ప్రభుత్వశాఖలకు సంబంధించిన ఉద్యోగులు సేవలందించే విషయంలో ముందు వరుసలో ఉన్నారు. వారిలో డాక్టర్లు ముందు వరుసలో ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ డాక్టర్ల కోసం ఏపీ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ విధుల్లో భాగంగా సేలందిస్తూ ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు ఎవరైనా కరోనాతో మృతి చెందితే.. వారి కుటుంబాలను సాధ్యమైనంత తొందరగా ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే వారి కుటుంబంలో ఒకరికి 30 రోజుల్లోగా ప్రభుత్వ ఉద్యోగాల ఇచ్చేలా చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి ఏపీ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు.
డాక్టర్ చనిపోయిన ఆస్పత్రి ఉన్న జిల్లాకు సంబంధించిన డీఎంహెచ్‌వో లేదా డీసీహెచ్ఎష్ లేదా బోధనాసుపత్రి అయితే సూపరిండెంట్ వెంటనే వివరాలు పంపించాలని ఆదేశించింది. అలాంటి వారి వివరాలు వచ్చిన వెంటనే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. ఇక కరోనా సమయంలో బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు వీలుగా ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచడంతో పాటు అవసరమైన డాక్టర్లు, నర్సులు, స్పెషలిస్టులు ఇతర సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన ప్రత్యేకంగా నియమించుకునేందుకు ప్రభుత్వం చర్యలను చేపట్టింది. ఇందుకు కోసం భాగంగా కోవిడ్ చికిత్సలతో పాటు సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా 30,887 మంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చారు.
0 Comments