- ప్రధాని మోదీ ఏం చేసినా జాతి ప్రయోజనాల కోసమే చేస్తారు. దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొనే అడుగు వేస్తారు. ఇది ఆయన అభిమానులు, బీజేపీ నేతలు చెప్పే మాట. అందుకు తగ్గట్లే పాలనను పరుగులు పెట్టించిన ప్రధాని మోదీ.. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు రంగాల్లో సంచలన సంస్కరణలు అమలుచేేశారు. ఐతే ఆయనలోని మరో కోణం వెలుగులోకి వచ్చింది.
- అదే దాతృత్వం..! ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన్నప్పటి నుంచీ ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలకు ఆయన విరాళాలు ఇచ్చారు. కోవిడ్ 19 వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ ఏర్పాటుచేసిన PM Cares ఫండ్‌కు ఆయన ఎంత విరాళం ఇచ్చారో తెలుసా..? తాను పొదుపు చేసిన డబ్బు నుంచి రూ.2.25 లక్షలను ఆయన విరాళమిచ్చారు. PM Caresకి తొలి విరాళం అందజేసింది కూడా ప్రధాని మోదీయే..!
సౌత్ కొరియా నుంచి సియోల్ పీస్ ప్రైజ్‌ను అందుకున్న ప్రధాని మోదీ.. దాని ద్వారా వచ్చిన మొత్తం రూ.1.3 కోట్ల డబ్బును 'నమామి గంగే' కార్యక్రామానికి విరాళంగా అందజేశారు.
2015 వరకు ప్రధాని మోదీకి పలువురు బహూకరించిన బహుమతులన్నింటినీ సూరత్‌లో వేలం వేశారు. అలా వచ్చిన రూ.8.35 కోట్ల నగదును కూడా నమామి గంగే మిషన్‌కే ప్రధాని కేటాయించారు.
గుజరాత్ సీఎంగా పదవీ కాలం ముగిసిన తర్వాత.. తాను దాచుకున్న సొమ్ము నుంచి రూ.21 లక్షలను గుజరాత్ ప్రభుత్వ ఉద్యోగుల కూతుళ్ల చదువుకు విరాళం ఇచ్చారు మోదీ.
తాను సీఎంగా పనిచేసిన సమయంలో వచ్చిన కానుకలన్నింటినీ ఓసారి వేలం వేయగా రూ.89.90 కోట్లు సమకూరాయి. ఆ డబ్బును కన్యా కెలవాని నిధికి అందజేశారు. అమ్మాయిల చదువు కోసం విద్యా కోసం దాన్ని వినియోగించారు.
బలికల చదువు నుంచి మొదలుకొని నమామి గంగే, పీఎం కేర్స్ ఫండ్‌కు ఎన్నోసార్లు విరాళాలు అందజేశారు ప్రధాని మోదీ. అలా ఇప్పటి వరకు రూ.103 కోట్లుపైగానే దాన ధర్మాలు చేసినట్లు తెలిసింది.
0 Comments