స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఎన్టీఆర్‌తో చేస్తున్నట్టు ప్రకటించాడు. అంతా బాగుంటే.. ఈ పాటికి ఈ చిత్రం మొదలయి.. వచ్చే సమ్మర్ నాటికి ఈ సినిమా విడుదల చేయాలనకున్నారు. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ పేరుతో ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్కిప్ట్ వర్క్ ను మాటల మాంత్రికుడు లాక్ చేసేసాడు. కాగా గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో ‘అరవింద సమేత వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తాజా సినిమా కొంత పొలిటికల్ టచ్‌తో తెరకెక్కించనున్నారు. అంతేకాదు ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్ చినబాబుతో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో కళ్యా ణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ దాదాపు ఖాయం చేసారు. మరో కథానాయికగా శృతి హాసన్‌ను అనుకుంటున్నారు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లెదట.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ లేెటెస్ట్ మూవీ పోస్టర్ (Twitter/Photo)
ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కంప్లీట్ కావాలి. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్‌తో పాటు ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్ సినిమాను ఈ దసరా తర్వాత మొదలు పెట్టి.. కంటిన్యూగా నాల్గు నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు రాజమౌళి. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సమ్మర్‌లో రిలీజ్ చేయనున్నారు.
0 Comments