అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు : సీఎం జగన్‌

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు : సీఎం జగన్‌

వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ గణేషుని ఆశీస్సులతో రాష్ట్రం ఎల్లవేళలా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ‘విద్య, విజ్ఞానం, వినయ ప్రదాత వినాయకుడు. విఘ్నాలను తొలగించి సకల అభిష్టాలను సిద్ధింపజేసే ఆదిపూజ్యుడు విఘ్నేశ్వరుడు. ఆ గణేషుని ఆశీస్సులతో రాష్ట్రం ఎల్లవేళలా సుభిక్షంగా ఉండాలని, కరోనాకష్టం తొలగిపోయి అంతటా సుఖసంతోషాలు నిండాలని ప్రార్ధిస్తూ.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు’  అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. 

Post a Comment

0 Comments