‘ నువ్వు, పిల్లలు జాగ్రత్త… 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడకపోతే బ్రతికే పరిస్థితి లేదు ’.. ఏఈ సుందర్ చివరగా భార్యతో మాట్లాడిన మాటలు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న 9 మంది చెందారు. వీరిలో సుందర్ నాయక్ ఒకరు. 35 ఏళ్ల సుందర్ నాయక్ నిన్ననే తిరిగి విధుల్లో చేరాడు. కరోనా బారిన పడిన సుందర్.. కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకున్న తర్వాత కోలుకున్నారు. గురువారం డ్యూటీకి హాజరయ్యాడు.
కానీ మృత్యుంజయుడనుకున్న సుందర్‌ను విధి మరోలా వక్రించడంతో ప్రాణాలు కోల్పోయాడు. కరోనాను జయించిన సుందర్.. ఇలా విద్యుత్ ప్రమాదంలో చిక్కుకుని మృతి చెందుతాడని ఎవరూ ఊహించలేదు. ఈ ప్రమాదంలో తొలుత లభించిన మృతదేహం కూడా సుందర్‌దే కావడం గమనార్హం. ప్రమాదంలో చిక్కుకున్న తర్వాత ఇక ప్రాణాలతో బయటపడలేమని ఊహించిన సుందర్.. భార్యకు జాగ్రత్తలు చెప్పాడు.
‘నువ్వు, పిల్లలు జాగ్రత్త. 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడలేకపోతే బ్రతికే పరిస్థితి లేదు’ అని భార్యకు ఫోన్‌లో ప్రమాద తీవ్రతను వివరించాడు. కాగా, మోహన్ అనే మరో ఏఈ తోటి వారిని కాపాడటానికి సహకరించాడు. ఈ ఘటనలో 17 మంది విధుల్లో ఉండగా, 9 మంది ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 8 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలోని శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో నిన్న రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొదటి యూనిట్ లో పెద్ద శబ్దాలతో పేలుడు సంభవించింది. తొలుత ప్యానెల్ బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి జల విద్యుత్ కేంద్రం మొత్తం వ్యాపించాయి.
సిబ్బందిలో కొంతమంది సొరంగ మార్గం ద్వారా బయటపడగా 9 మంది లోపలే చిక్కుకుపోయారు. తెల్లవారుజాము నుంచి సహాయక చర్యలు కొనసాగుతుండగా మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఏఈ సుందర్ నాయక్ మృతదేహాన్ని గుర్తించారు. ఆ తర్వాత మరో ఎనిమిది మృతదేహాలను రెస్క్యూ టీమ్ గుర్తించింది.
భారీగా మంటలు చెలరేగడం, దట్టంగా పొగలు అలుముకోవడంతో పని చేస్తున్న ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు రక్షించుకోవడానికి బయటకు పరుగులు తీశారు. ప్రమాద సమయంలో 17 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో కొంతమంది మహిళా ఉద్యోగులున్నట్లు సమాచారం. సొరంగమార్గం ద్వారా 8 మంది సురక్షితంగా బయటకు వచ్చారు.

0 Comments