Sikh Driver Attack | అమెరికా (America)లో సిక్కు డ్రైవర్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ట్రంప్ బృందం ‘మిస్టర్ సింగ్’ పోస్ట్‌పై వివాదం కొనసాగుతున్న క్రమంలో.. ఈ దాడి జరగడం గమనార్హం.
బాధితుడు మాట్లాడుతూ.. తనపై ఎందుకు దాడి చేశారో అర్థం కావడం లేదన్నారు. మరోసారి దాడి చేస్తారనే భయంతో ఆయన పేరు కూడా బయట పెట్టొద్దని కోరారు. సింగ్ పెన్సిల్వేనియాకు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఆయన మార్గ మధ్యలో బాత్రూమ్ ఉపయోగించడానికి ఆగాడు. అతను లోపలికి నడుస్తున్నప్పుడు, వెనక నుంచి వచ్చిన ఓ వ్యక్తి 17 సార్లు కత్తితో దాడి చేశాడు. దీంతో సింగ్ తీవ్రంగా పడ్డాడు. అనంతరం అతడిని గమనించి ఓ కుటుంబం ఆస్పత్రికి తరలించింది.
Sikh Driver Attack | మిస్టర్ సింగ్ వివాద నేపథ్యం
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఇటీవల ఓ భారతీయ ట్రక్ డ్రైవర్ చిత్రాన్ని పోస్ట్ చేసింది. ‘‘మా రోడ్ల మీద నుండి దిగిపోండి. మీకు డ్రైవింగ్ చేయడం రాదు మిస్టర్ సింగ్” అనే శీర్షికతో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో ‘సింగ్’ అనే ఇంటిపేరును ఉపయోగించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కాగా అమెరికాలో చాలా మంది సిక్కులు డ్రైవర్లుగా పని చేస్తున్నారు. అనంతరం డీహెచ్ఎస్ ఆ పోస్టును తొలగించింది. ఈ క్రమంలోనే ఓ సిక్కు డ్రైవర్‌పై దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. దాడి ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

0 Comments