పాత్రికేయునికి దక్కిన అరుదైన గౌరవంజర్నలిస్ట్ చేకూర్తి నవీన్ పటేల్‌కు ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు


చట్టం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : వేములవాడ ప్రాంతానికి చెందిన జర్నలిస్ట్ చేకూర్తి నవీన్ పటేల్‌కు అరుదైన గౌరవం దక్కింది. సామాజిక సేవలతో పాటు పాత్రికేయ రంగంలో అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేశారు.

హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి మెయిన్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో నవీన్ పటేల్ అవార్డును అందుకున్నారు. గత ఐదేళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, పాత్రికేయ రంగంలో చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.

నవీన్ పటేల్‌కు జాతీయ స్థాయి అవార్డు రావడం పట్ల పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలియజేశారు. స్నేహితులు, బంధువులు సైతం సంతోషం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
Reactions

Post a Comment

0 Comments