యాచారం-మంచిప్ప రహదారిపై పులి సంచారం*


*చట్టం గాంధారి*

 సదాశివ నగర్ మండలంలోని యాచారం, మంచిప్ప ప్రధాన రహదారిపై పులి సంచారం కలకాలం రేపింది. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణులు అడవిని విడిచి బయటకు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. పోలీస్ సంచార నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రాకపోకలు సాగించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా తగిన భద్రత చర్యలు చేపట్టాలని స్థానికులు అటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Reactions

Post a Comment

0 Comments