Vaishnavi Husband Murder Case | ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. హరిబాబును తానే హత్య చేసినట్లు వైష్ణవి సోదరుడు సంతోష్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ బహిరంగంగా అంగీకరించాడు.
Vaishnavi Husband Murder Case | “నా చెల్లిని చంపినవాడిని వదల్లేదు!”
హరిబాబు హత్య అనంతరం సంతోష్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. “నా చెల్లిని చంపినవాడిని నేనే చంపేశాను. నా చెల్లి వైష్ణవికి జరిగిన ఘోరం, అన్యాయం సమాజంలో మరే ఆడబిడ్డకు జరగకూడదు” అని ఆ వీడియోలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
Vaishnavi Husband Murder Case | పోలీసుల ఎదుట లొంగుబాటు
హరిబాబును అంతమొందించిన తర్వాత తాను నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నానని, పోలీసులకు లొంగిపోతున్నట్లు సంతోష్ తెలిపాడు. యూట్యూబర్ వైష్ణవి మృతి ఘటన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు, భర్త హరిబాబు మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే పగ పెంచుకున్న వైష్ణవి సోదరుడు సంతోష్ ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.
వీడియో వైరల్ కావడంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. కోరుట్లలో లొంగిపోయిన సంతోష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

సంతోష్ భార్య సెల్ఫీ వీడియో…
కాగా, నిందితుడు సంతోష్ భార్య కూడా ఒక వీడియో విడుదల చేశారు. గతేడాది ఇదే రోజు (సెప్టెంబరు 17) చిట్టి (వైష్ణవి) హత్యకు గురైన విషయాన్ని గుర్తుచేశారు. వైష్ణవి భర్త హరిబాబు హత్యతో తన చిట్టికి న్యాయం జరిగిందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

0 Comments