రైతులకు జగన్ సర్కార్ మరో శుభవార్త.. ఖాతాల్లో రూ.4.23 కోట్లు జమ, వారికి మాత్రమే

రైతులకు జగన్ సర్కార్ మరో శుభవార్త.. ఖాతాల్లో రూ.4.23 కోట్లు జమ, వారికి మాత్రమే

వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం రూ.4,23,10,183 జమ చేసింది. వ్యవసాయ సబ్సిడీని రైతుల ఖాతాల్లోకి ప్రత్యక్షంగా బదిలీ చేసి, అక్కడి నుంచి విద్యుత్‌ పంపిణీ సంస్థకు పంపనున్నారు. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్‌ నెల వ్యవసాయ విద్యుత్‌ బిల్లుల మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి మళ్లించారు. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి శుక్రవారం జీవో జారీ చేశారు.  

Post a Comment

0 Comments