వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో భాగంగా నూతనంగా చేపట్టిన స్లాట్‌ బుకింగ్ ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నెల 21వ తేదీ నుంచి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరపనున్నట్లు వెల్లడించింది. అయితే కార్డ్‌ (సీఏఆర్‌డీ) విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 ఇప్పటికే స్లాట్‌ బుక్ చేసుకున్న వారికి యథాతథంగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఆధార్‌, కులం, కుటుంబసభ్యుల వివరాలు, సామాజిక హోదా తదితరాలను తొలగిస్తూ మాన్యువల్‌ను సవరించేదాకా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్లాట్‌ బుకింగ్‌, ప్రాపర్టీ ట్యాక్స్‌ ఇండెక్స్‌ నంబరు (పీటీఐఎన్‌) నమోదును ఆపాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నెల 11న స్లాట్‌ బుకింగ్‌ ప్రారంభంకాగా 14 నుంచి రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

 అయితే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాతపద్ధతిలోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. కొన్నాళ్ల పాటు పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

Post a Comment

0 Comments