సీజన్‌కు సంబంధించిన రైతు బంధు సాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో నేటి నుంచి రైతు బంధు సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు అధికారులు. ఇవాళ్టి నుంచి జనవరి 7వ తేదీ వరకు విడతల వారీగా రైతు బంధు సొమ్మును అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. అయితే మొదటగా ఎకరంలోపు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయాన్ని జమ చేయనున్నారు. ఆ తర్వాత రెండెకరాల లోపు పొలం ఉన్నవాళ్లకు.. ఆపై మూడెకరాల లోపు పొలం ఉన్నవారికి.. విడతల వారీగా నగదు జమ చేయనున్నారు
0 Comments