రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్... రేపే ఖాతాల్లోకి నగదు..!

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్... రేపే ఖాతాల్లోకి నగదు..!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. నవరత్నాలు అమలులో భాగంగా వరసగా రెండో ఏడాది రైతులకు పెట్టుబడి సహాయం చేస్తోంది. ‘వైయస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌’ పథకం కింద రైతుల ఖాతాల్లో మూడో విడత నగదు జమచేయనుంది. అలాగే ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ఇన్ పుట్ సబ్సిడీతో పాటు నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయనుంది.

 మరోవైపు ఆర్ఓఎఫ్ఆర్ కింద పట్టాలందుకున్న గిరజనులకు కూడా రైతు భరోసా కింద సాయం అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 చొప్పున పెట్టుబడి జమ చేసిన ప్రభుత్వం.. మూడో విడతలో భాగంగా రూ.2 వేల చొప్పున పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.


రైతు భరోసా పథకం కింద ఏటా రైతులకు పెట్టుబడి సహాయంగా ఇస్తున్న రూ.13,500ను వరసగా రెండో ఏడాది కూడా ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తోంది. తొలి విడతగా ఖరీఫ్ సీజన్ ఆరంభంలో అంటే ఈ ఏడాది మే 15న సాయం అందించగా.. అక్టోబర్ 27న రెండో విడత సాయం జమ చేసింది. మూడో విడతగా రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లో వేయనున్నారు. రాష్ట్రంలో 51.59 లక్షల రైతు కుటుంబాల ఖాతాల్లో మొత్తం రూ.1,120 కోట్లు జమ చేయనున్నారు.

Post a Comment

0 Comments