వైఎస్సార్ చేయూత, ఆసరా మహిళలకు పశువుల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీంతో పాటు అమూల్ కార్యకలాపాలను కూడా ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పశువుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అమూల్‌తో ఒప్పందం ద్వారా పాడిరైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. పాదయాత్రలో పాడి రైతుల కష్టాలను చూశానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక సహకార సొసైటీలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చామని గుర్తుచేశారు. మార్కెట్‌లో పోటీతత్వం వస్తేనే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. అమూల్‌తో ఒప్పందం వల్ల పాడిరైతులకు లీటర్‌కు రూ.5 నుంచి రూ.7 వరకు ఆదాయం చేకూరుతుందని పేర్కొన్నారు. అమూల్‌కు వచ్చే లాభాల్లో ఏడాదికి రెండుసార్లు బోనస్ రూపంలో మహిళలకే ఇస్తుందని సీఎం వైఎస్ జగన్ వివరించారు.
0 Comments