ఓటర్లు లేక పోలింగ్‌ కేంద్రంలో సిబ్బంది కునుకుపాట్లు

ఓటర్లు లేక పోలింగ్‌ కేంద్రంలో సిబ్బంది కునుకుపాట్లు

అందుకు రావాల్సిన వాళ్లు మాత్రం కదిలి రాలేదు. తమ భవిష్యత్తును బలంగా తీర్చిదిద్దే ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఎవరొస్తే మనకేంటిలే.. ఏ పార్టీ గెలిస్తే మనకేం వస్తాదిలే అన్న చందాగా గ్రేటర్ ప్రజలు వ్యవహరించారు. ఫలితంగా పలు పోలింగ్ భారీగా తగ్గిపోయింది. పలు పోలింగ్ కేంద్రాల్లో అయితే ఓటర్లు రాక అక్కడ పనిచేసే సిబ్బంది టేబుళ్లపై ప్రశాంతంగా పడుకోవడమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం.
పడుకున్న ఎన్నికల సిబ్బంది
హైదరాబాద్ పాతబస్తీ యాకుత్‌పురా తలాబ్ చంచలంలో పరిస్థితి మరి దారుణంగా మారింది. ఇక్కడ 44వేల 969మంద ఓటర్లు ఉన్నారు. కానీ మధ్యాహ్నం దాటినా ఓటు వేసేందుకు మాత్రం కేవలం 332మంది మాత్రమే వచ్చారు. అంటే అక్కడున్న ఓటర్లలో ఒక్క శాతం మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఓటర్లు లేక పనిలేక.. ప్రశాంతంగా తామ పనిచేయాల్సిన బల్లలపైనే పడుకున్నారు. ప్రజలు ఓటు వేసేందుకు ఎంత ఇంట్రస్ట్ చూపిస్తున్నారో దీని బట్టి తెలుస్తోంది. దీంతో పలువురు భాగ్యనగర ప్రజల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0 Comments