వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. మహిళలకు మాత్రమే.. వంద రోజుల పాటు

వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. మహిళలకు మాత్రమే.. వంద రోజుల పాటు


 వంద రోజుల మహిళా మార్చ్‌ బ్రోచర్‌ను శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి విడుదల చేశారు. నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలు, వాటిపై అవగాహనతో పాటు దశలవారీ మద్యపాన నిషేధం, దిశ యాప్, ఇతర చట్టాలు, హెల్ఫ్‌ లైన్‌ నంబర్ల పై మార్చి 8 వరకు వంద రోజుల కార్యాచరణను రూపొందించింది ఏపీ మహిళా కమిషన్‌. వంద రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాలేజీ విద్యార్ధినులకు రక్షణ టీంలు, సైబర్‌ నేరాలపై అవగాహన సదస్సులను మహిళా కమిషన్ నిర్వహించనుంది.

 ఈ బ్రోచర్‌ను సీఎం జగన్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతం సవాంగ్, ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఏపీఐఐసీ ఛైర్‌ పర్సన్‌ ఆర్‌ కె రోజా సెల్వమణి, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, మహిళా కమిషన్‌ డైరెక్టర్‌ ఆర్‌ సుయజ్‌ హాజరయ్యారు.

Post a Comment

0 Comments