(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) : ఇర్కోడ్ చేనేత సహకార సంఘoలో నేత కార్మికుడు గోనె కృష్ణహరి గొల్ల భామ చీరె 2020 ప్రభుత్వం నుండి అవార్డు 10,000/- రూపాయలు వచ్చినoదున ఇర్కోడ్ చేనేత సహకార సంఘo అధ్యక్షులు కాముని రాజేశం పూల మాల వేసి శాలువాతో సత్కరించారు. కాముని రాజేశం మాట్లాడుతు గోనే కృష్ణ హరి దాదాపు 25 సంవత్సరాల నుండి చేనేత వృత్తి కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుండి గొల్ల భామ చీరెలను నేస్తున్నాడు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గూడూరు బాబు, దుద్దెడ చేనేత సహకార సంఘo మాజీ ప్రధాన కార్యదర్శి లగిశెట్టి బాల్ నర్సు, పద్మశాలి సమాజం ఉపాధ్యక్షులు ఇప్పకాయల శ్రీహరి, కళ్ళకుoట కాలనీ పద్మశాలి సమాజం అధ్యక్షులు జిందo మల్లేశం, మేనేజర్ గుండ్ల హనుమంతు, నేత కార్మికులు పాల్గొన్నారు.
0 Comments