(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) : స్కీమ్ వర్కర్స్ ను కార్మికులుగా గుర్తించాలని, కనిసవేతనాలు 21,000 రూపాయలు నిర్ణయం చేసి అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో అంబెడ్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సిద్దిపేట కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్కీం వర్కర్లు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి, అంబెడ్కర్ విగ్రహంకు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రేవంత్ కుమార్ మాట్లాడుతూ దేశంలో కోవిడ్ వ్యాధి రోజురోజుకు తీవ్రమవుతున్న క్లిష్ట పరిస్థితులలో వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న సిబ్బంది కార్మికుల అపూర్వ సేవల వల్ల కోవిడ్ మరణాల రేటు తగ్గిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనం, ఆశ, సర్వశిక్ష అభియాన్, ఐసిడిఎస్, తదితర స్కీముల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ధరల కనుగుణంగా కార్మికుల వేతనాలు, సంక్షేమ పథకాలకు నిధులు పెంచాలి. స్కీమ్ వర్కర్ల అందర్నీ కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం నెలకు 21 వేల రూపాయలు ఇవ్వాలని ఇఎస్ ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఐకెపి వివోఏలకు నాలుగు నెలల బకాయి వేతనాలు ఇవ్వాలని అన్నారు. కొవిడ్ 19లో ముందు వరుసలో పనిచేస్తున్న కార్మికులందరికీ 50 లక్షల బీమా సౌకర్యం ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల సవరణ, రద్దు, పనిగంటల పెంపు తక్షణం ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్, యాదమ్మ, రాజమని, ఎల్లయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.
0 Comments