(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) : సిద్దిపేట మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఉపాధ్యక్షుడు నంది ఎల్లయ్యతో సిద్దిపేట పార్లమెంట్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని ఆయన లేని లోటు తీర్చలేనిదని, ఆయన మృతి నిజంగా బాధాకరం అని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వంగ హనుమంత్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శివప్ప, కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ వర్మ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ బొమ్మల యాదగిరి సంతాపం ప్రకటించారు. వారు మాట్లాడుతూ సిద్దిపేట అభివృద్ధి, టీవీ రిలే కేంద్రం, మాతా శిశు సంక్షేమ కేంద్రం అలాగే ల్యాండ్ లైన్ అభివృద్ధి గ్రామ గ్రామాన బస్ స్టేషన్స్ పట్టణం మంచినీటి కొరత ఇంటింటికి గ్యాస్ కలెక్షన్ లు, అనేక గ్రామాలకు రోడ్డు సౌకర్యం అనేక పథకాలు తీసుకువచ్చి సిద్దిపేట నుండి ఎంతో అభివృద్ధి చేశారు. సేవలు చిరస్మరణీయం సిద్దిపేట నుండి ఎనిమిదిసార్లు ఎంపీగా పోటీ చేసి ఐదు సార్లు గెలిచిన ఘనత ఆయనకు దక్కింది. కేంద్రంలో కమిటీలో పనిచేశారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ ఎంపీగా ప్రజలకు సేవ చేశారు. ఈ రోజు ఆయన మరణించడం చాలా బాధాకరం ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ మాతోపాటు రాష్ట్ర మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ ఎండి కరీముద్దీన్, వహీద్ ఖాన్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పొట్ల కనకయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నక్కల శ్రీనివాస్ రెడ్డి సంతాపం తెలిపారు.
0 Comments